ముంబైలో ఉబర్ కొత్త పథకాన్ని ప్రారంభించింది. 'మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ కవర్' పేరుతో, విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో రైడ్ ఆలస్యం అయ్యి ఫ్లైట్ మిస్ అయితే రూ.7,500 వరకు పరిహారం అందించనుంది. రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో తీసుకువచ్చిన ఈ ప్లాన్, వైద్య ఖర్చులను కూడా కవర్ చేస్తుంది. క్లెయిమ్ చేయడానికి రైడ్ బుకింగ్ వివరాలు, మిస్ అయిన ఫ్లైట్ టికెట్ తదితర డాక్యుమెంట్లు సమర్పించాలి.