బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'మహారాజ్'. ఈ మూవీకి సిద్దార్థ్ పి మల్హోత్రా దర్శకత్వం వహించగా.. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. జూన్ 14న ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్రకటించారు. కానీ పలు వివాదాలతో వాయిదా పడింది. ఇక తాజాగా ఈ సినిమాను ట్రైలర్‌తో పాటు మూవీని నెట్‌ఫ్లిక్స్ వేదికగా మేకర్స్ విడుదల చేశారు.