మనుషులు జంతువులపై తమ ప్రేమాభిమానాలను ఒక్కో విధంగా చాటుకుంటూ ఉంటారు. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో రెండు ఆవులు ఓ ఫుడ్ స్టాల్ ముందు ఆగాయి. ఆకలిగా ఉన్నట్టు కనిపిస్తున్న ఆ రెండు ఆవులు స్టాల్‌లోని మహిళ పెట్టే ఫుడ్ కోసం ఆశగా ఎదురు చూశాయి. అయితే ఆవులకు చపాతీ పెట్టగానే.. అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఇలా జంతువులపై దయ చూపుతున్న మహిళపై అనేక మంది ప్రశంసల వర్షం కురిపించారు.