బొప్పాయి సాగు విధానం

బొప్పాయి పంట సాగుకు మిట్టనేలలు అనుకూలంగా ఉంటాయి. ఈ నేలలను బాగా దున్నుకొని డ్రిప్‌ పైపులను అమర్చుకోవాలి. ప్రతి ఆరడుగులకు ఒక అడుగు లోతు గుంత తవ్వి అందులో ఆవు ఎరువును వేసి వారం పదిరోజులు మగ్గనివ్వాలి. తర్వాత అందులో మొక్కలు నాటాలి. నాటిన మూడు రోజులకు నీరు అందించాలి. నాలుగురోజులకోసారి నీటితో మొక్కలను తడిపితే సరిపోతుంది. పిందె దశలో ఒకరోజు తప్పి ఒకరోజు నీరందిస్తే ఆరు నెలల్లో బొప్పాయి పంట దిగుబడి ప్రారంభమవుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్