కర్ణాటకలో జేడీఎస్ ఎంపీ, మాజీ ప్రధాని దేవె గౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేవె గౌడ తన మనవడు ప్రజ్వల్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై తొలిసారి స్పందించారు. నేరం రుజువైతే ప్రజ్వల్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.