హమాస్ చెర నుంచి నలుగురికి విముక్తి

గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం నలుగురు మహిళా బందీలను శనివారం హమాస్‌ విడుదల చేసింది. వారు కరీనా అరీవ్, డానియెల్‌ గిల్‌బోవా, నామా లెవి, లిరి అల్బాజ్‌. ఇందుకు ప్రతిగా 100కు పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయెల్‌ విడిచిపెట్టనుంది. కాల్పుల విరమణ ప్రారంభమైన తొలి రోజు ముగ్గురు మహిళా బందీలను హమాస్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు మరో నలుగురిని విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్