సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన

సైబర్ నేరగాళ్లు చెప్పే మోసపూరిత మాటలు నమ్మకండని ఏఎస్సై ఆంజనేయులు హెచ్చరించారు. ఆదివారం నారాయణపేట పట్టణంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. లోన్ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఫోన్లకు వచ్చే అనవసరపు లింకులు ఓపెన్ చేయరాదని, అపరిచితులకు బ్యాంకు ఖాతా, ఏటీఎం, ఓటిపి వివరాలు ఇవ్వరాదని అన్నారు. సైబర్ మోసంలో ఆర్థికంగా నష్టపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్