బాధితుడికి ఆర్థిక సహాయం అందజేత

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామానికి చెందిన మేకల రాములు గడ్డివాముకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకునిన కాంగ్రెస్ మండల సమన్వయకర్త తూడి శ్రీనివాస్ రెడ్డి బుధవారం స్వయంగా గ్రామానికి వెళ్లి బాధితుడికి ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం తరుఫున సహాయ సహకారాలు సైతం అందేలా చూస్తామని భరోసా కల్పించారు. ఎంపీపీ రఘు ప్రసాద్, మాజీ సర్పంచ్ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్