ZEE మీడియా కార్పొరేషన్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా ఉన్న అభయ్ ఓజాను ఆ సంస్థ తాజాగా తొలగించింది. మే 4న జరిగిన బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని జీ మీడియా సోమవారం రెగ్యూలేటరీ సంస్థలకు తెలిపింది. కాగా.. అభయ్ తొలగింపునకు కారణాలను వెల్లడించలేదు. 2022లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా చేరిన ఓజా.. గతేడాది సీఈఓ గా బాధ్యతలు స్వీకరించారు.