సూపర్‌స్టార్ మహేశ్ బాబు రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ నిన్న సాయంత్రం జర్మనీకి వెళ్ళాడు. ప్రిన్స్ ఎయిర్‌పోర్ట్‌లో సోలోగా కనపడటంతో.. పలువురు ఫ్యాన్స్ ఆయనతో ఫోటోలు దిగారు. ఓ అభిమాని మాత్రం ఆటోగ్రాఫ్ అడుగగా.. లవ్, మహేష్ బాబు అని ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అతను దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం మహేష్ బాబు ఆటోగ్రాఫ్ వైరల్ అవుతోంది.