భావోద్వేగాలు మనుషులకు మాత్రమే సొంతమైన అంశం కాదు.. అన్ని ప్రాణుల్లోనూ అది ఉంటుంది. ఆస్ట్రేలియాలో కనిపించే కోలా అనేవి ఎలుగుబంటిని పోలి ఉండే చిన్న జీవులు. ఇవి పూర్తి శాకాహార జీవులు. ఓ కోలా చనిపోయిన కోలాను తన ఒళ్లో పెట్టుకుని రోదిస్తోంది. దానిని తనివితీరా హత్తుకుని తన ప్రేమను చాటుకుంది. ఈ వీడియోను కోలా రెస్క్యూ గ్రూప్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా.. నెట్టింట వైరల్గా మారింది.