నాంపల్లి: రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన కార్పొరేటర్

మల్లేపల్లి డివిజన్ వ్యాప్తంగా అవసరం ఉన్న ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నామని డివిజన్ కార్పొరేటర్ జాఫర్ ఖాన్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని బడి మసీదు వద్ద కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. రూ. 50 లక్షల వ్యయంతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనులు పూర్తి అయితే స్థానికంగా ట్రాఫిక్ సమస్యలు ఉండవన్నారు. పనులు కొనసాగుతున్న నేపథ్యంలో స్థానికులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్