కాలమేదైనా ఆకుకూరలు త్వరగా పాడైపోతాయి. అలాగని ఫ్రిజ్‌లో నిల్వ చేసినా 2, 3 రోజులకు మించి అవి తాజాగా ఉండవు. అయితే ఈ చిట్కాతో కరివేపాకును 6 నెలల పాటు తాజాగా నిల్వ చేసుకోవచ్చు. ముందుగా ఆకుల్ని కాడ నుంచి వేరు చేసి.. కొన్ని కొన్ని ఆకుల్ని ఐస్‌క్యూబ్స్ ట్రేలో అమర్చాలి. అవి మునిగేలా నీళ్లు నింపి.. మూత పెట్టి ట్రేను ఫ్రీజర్‌లో పెట్టాలి. అవి గడ్డకట్టాక.. వాటిని జప్లాక్ బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే సరి.