మా రైతులకు ప్రయోజనం చేకూరేలా భారత్ నిర్ణయం: అమెరికా

అమెరికా రైతులకు ప్రయోజనం చేకూరేలా భారత్ తన మార్కెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్ అడ్మినిస్ట్రేషన్‌లోని అధికారి తెలిపారు. ‘గత జూన్‌లో భారత్-అమెరికా ఆరు WTO వివాదాలను పరిష్కరించుకున్నాయి. దీంతో అనేక యూఎస్ ఉత్పత్తులపై సుంకాలను తొలగించడానికి భారత్ అంగీకరించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా రైతులకు ప్రయోజనం చేకూరింది. శనగలు, కాయధాన్యాలు, బాదం, వాల్‌నట్‌లు, యాపిళ్లకు భారత్ మార్కెట్ అందుబాటులోకి వచ్చింది’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్