కేన్స్‌లో చరిత్ర సృష్టించిన భారతీయ నటి

77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా చరిత్ర సృష్టించారు. ‘అన్ సర్టెయిన్ రిగార్డ్’ విభాగంలో ఆమెకు ఉత్తమ నటి అవార్డు దక్కింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రోత్సవంలో ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్న తొలి భారతీయురాలిగా అనసూయ నిలిచారు. బల్గేరియన్‌ డైరెక్టర్ కాన్ స్టాంటిన్ బొజనోవ్ ‘ది షేమ్ లెస్ ’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో వేశ్య పాత్రలో నటించిన అనసూయకు ఈ అవార్డు దక్కింది.

సంబంధిత పోస్ట్