సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ఏపూరి వెంకటేశ్వర రావు, కొలికపోగు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. సత్తుపల్లి కళాశాభారతిలో బుధవారం మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో కొర్రపాటి సాల్మన్ రాజు, గొల్లా ముత్తారావు, శ్రీను, లక్ష్మణ్, తడికమళ్ల దేవదాస్, కోటా ప్రసాద్, దేవన్న, కలపాల ఏసు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.