నాణ్యమైన విత్తనాలతోనే అధిక దిగుబడులు సాధించవచ్చని అంకూర్ సీడ్స్ మేనేజర్ కోటేశ్వరావు అన్నారు. ఆదివారం అడవి మద్దులపల్లి గ్రామంలో నల్లమోతు వెంకటేశ్వర్లు సాగు చేసిన అంకూర్ సీడ్స్ వారి ఏఆర్సీహెచ్ 099 మిరపతోటలో రైతు క్షేత్ర ప్రదర్శన నిర్వహించగా జిల్లాలోని పలు మండలాలకు చెందిన 900 మంది రైతులు పాల్గొన్నారు. మేనేజర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఒక ఎకరాకు 35 నుండి 40 క్వింటాల్ వరకు దిగుబడి వస్తుందన్నారు.