బెజ్జుర్ మండల కేంద్రంలోని లంబాడిగూడ వారసంత చౌరస్తాలో రోడ్డు భద్రత మాస ఉత్సవాల్లో భాగంగా ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం రోడ్డు భద్రతల పై, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. అనంతరం ఎస్సై మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలన్నారు. తొందరపాటుతనంతో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దన్నారు.