GHMCలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 10.71లక్షల దరఖాస్తులు వచ్చినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. వారం రోజుల్లో మిగిలిన 3.21 లక్షల దరఖాస్తుల పరిశీలిస్తామని హౌసింగ్ కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు. సర్వే పూర్తయిన తర్వాతే GHMCలో వార్డు సభలు నిర్వహిస్తామన్నారు. GHMC పరిధిలో 2,249 మందితో దరఖాస్తుల పరిశీలన ఉంటుందని.. https://indirammaindlu.telangana.gov.in/applicantSearchలో సర్వే సిబ్బంది వివరాలు ఉంటాయన్నారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు వార్డు సభల్లో ఇవ్వొచ్చన్నారు.