కళావేదిక, రాఘవి మీడియా నిర్వాహకులు మురళీమోహన్ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నందమూరి కుటుంబంలో పుట్టకపోయినా ఎన్టీఆర్కు తమ్ముడిని అనిపించుకున్నానని తెలిపారు. అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో ఆయనకు తమ్ముడిగా నటించడం వల్ల ఆ అదృష్టం దక్కిందని గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంతోనే తొలిషీల్డ్ అందుకున్నానని చెప్పారు.