ఈ ఐదు దేశాలకు ఉల్లి ఎగుమతులు

సార్వత్రిక ఎన్నికల ముందు ఇటీవల కేంద్రం ఉల్లి ఎగుమతులపై కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఉల్లి ఎగుమతులపై నిరవధికంగా నిషేధాన్ని పొడగించింది. అయితే పలు దేశాల దౌత్యపరమైన అభ్యర్థన తర్వాత ఐదు దేశాలకు ఉల్లిని ఎగుమతి చేసేందుకు అనుమతించింది. బంగ్లాదేశ్‌కు 50,000 టన్నులు, భూటాన్‌కు 550 టన్నులు, బహ్రెయిన్‌కు 3,000 టన్నులు, మారిషస్‌కు 1,200 టన్నులు, యూఏఈకి 14,400 టన్నుల ఎగుమతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

సంబంధిత పోస్ట్