ఈనెల 26న జరగనున్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించడానికి స్థానిక జీఎం ఆఫీసులో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని రామగుండం ఆర్జీ-1 సింగరేణి అధికార ప్రతినిధి కిరణ్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు.