మాజీ ఎంపీ, జేడీ(ఎస్) బహిష్కృత నేత ప్రజ్వల్ రేవణ్ణకు చుక్కెదురైంది. లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన దాఖలు చేసిన బెయిల్ అభ్యర్థనను ప్రత్యేక ప్రజా ప్రాతినిధ్య కోర్టు బుధవారం తోసిపుచ్చింది. హోలెనరసిపుర పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ప్రజ్వల్, ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణ నిందితులుగా ఉన్నారు. కాగా, పలువురు మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణను కూడా పోలీసులు గత శనివారం అరెస్టు చేశారు.