భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టర్ ఆఫీస్ లో అడిషనల్ కలెక్టర్ కి అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందజేయాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్, భోగ శ్రావణి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొడిపెల్లి గోపాల్ రెడ్డి, సురభి నవీన్ రావు, జె. ఎన్. సునీత, ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు కొక్కు గంగాధర్, జిల్లా అధికార ప్రతినిధి భూమి రమణ, జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, నియోజకవర్గ కన్వీనర్లు చిలకమర్రి మదన్ మోహన్, సుఖేందర్ గౌడ్, సత్యం, జగిత్యాల పట్టణ, మండల అధ్యక్షులు వీరబత్తిని అనిల్, నలువాల తిరుపతి, పడాల తిరుపతి, మంచే రాజేశ్, ఆముద రాజు మరియు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.