చింత చిగురుతో ఎన్నో లాభాలున్నాయి. రుచికరమైన ఆహారంగానే కాక దీన్ని తినడం వల్ల ఆరోగ్యం కూడా చేకూరుతుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. పైల్స్ ఉన్న వారికి కూడా బాగానే పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచిది పెంచుతుంది. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను తగ్గిస్తుంది.