గుండెపోటుతో నటుడు మృతి

తమిళ్ నటుడు ప్రదీప్ కె. విజయన్ కన్నుమూశారు. గత రెండు రోజులుగా ఇల్లు తెరవకపోవడంతో అతని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా శవమై కనిపించాడు. ప్రదీప్ గుండెపోటుతో చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతని మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రదీప్ పలు తెలుగు చిత్రాల్లో కూడా నటించారు.

సంబంధిత పోస్ట్