ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాను గ్లోబల్ ఫైర్ పవర్ అనే సంస్థ విడుదల చేసింది. ఇందులో 145 దేశాల సైనిక బలానికి సంబంధించి నివేదికను రూపొందించారు. దీని ప్రకారం.. సైనిక బలం పరంగా భారతదేశం నాల్గవ స్థానంలో కొనసాగుతుండగా, చైనా మూడవ స్థానంలో స్థిరంగా కొనసాగుతోంది. మొదటి రెండు స్థానాల్లో యునైటెడ్ స్టేట్స్, రష్యా ఉన్నాయి.