'ఉప్పొంగెలే గోదావరి' సాంగ్ లిరిక్స్

షడ్యమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శృతి శిఖరే నిగమఝరే స్వరలహరే

సా స పా పపపప మ ని స స ని స
సా స పా పపప పమదపప
సా స పా పపపప మ ని స స ని స
సా స పా ప పప పమ నిదప

ఉప్పొంగెలే గోదావరీ… ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరీ… మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి… వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారీ… రామ చరితకే పూదారి

వేసెయ్ చాప జోర్సెయ్ … నావ బార్సై వాలుగా
చుక్కానే చూపుగా.. బ్రతుకుతెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరీ… ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరీ… మా సీమకే చీనాంబరీ

సావాసాలు సంసారాలు… చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయంగానే… లాభసాటి బేరం
ఇళ్ళే ఓడలైపోతున్న… ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని… అడిగే నీటి అద్దం

ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ..!!
నది ఊరేగింపులో… పడవమీద రాగా
ప్రభువు తాను కాగా
ఉప్పొంగెలే గోదావరీ… ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరీ… మా సీమకే చీనాంబరి

గోదారమ్మ కుంకంబొట్టు… దిద్దె మిరప ఎరుపు
లంకానాధుడింకా… ఆగనంటు పండ్లు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతా కాంతకీ
సందేహాల మబ్బే పట్టె చూసే కంటికీ

లోకం కాని లోకంలోన… ఏకాంతాల వలపు
అల పాపికొండలా… నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా, ఆ

ఉప్పొంగెలే గోదావరీ… ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరీ… మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి… వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారీ… రామ చరితకే పూదారి

వేసెయ్ చాప జోర్సెయ్ … నావ బార్సై వాలుగా
చుక్కానే చూపుగా.. బ్రతుకుతెరువు ఎదురీతేగా
ఉప్పొంగెలే గోదావరీ… ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరీ… మా సీమకే చీనాంబరీ

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్