తెరాస కార్యకర్తలపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి..

నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామ సర్పంచ్ దాసరోజ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... గ్రామ శివారులో ఉన్న ఆఖరి వాగు ప్రవేశిస్తుంది. 1964లో ఆనకట్ట నిర్మాణం జరిగింది. అప్పుడు వేసిన గేట్లు తుప్పు పట్టి పోవడంతో నీరంతా వృధాగా పోతుండడంతో రైతులకు ఇబ్బంది జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులకు ప్రయోజనం చేరుకూర్చాలని.. రైతులకు పంటలు పండాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే రెడ్యా నాయక్ దృష్టికి తీసుకెళ్లగా.. వారు వెంటనే స్పందించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆనకట్టను సందర్శించిన ఏఈ, డిఈ, ఎస్ఓ, సంబంధిత శాఖల అధికారులు ఆనకట్టను సందర్శించారు. గ్రామంలో కొంతమంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు అంతా మేమే చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఇసుక మాఫియాతో ఎమ్మెల్యే గాని, కార్యకర్తలకు గానీ ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సర్పంచ్ మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాంపల్లి లక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జాటోత్ దేవేందర్ టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు డోనికేనా రామన్న, వార్డు సభ్యులు డోనికేనా జంపన్న, బూరుగడ్ల రవి, డైరెక్టర్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్