ప్రతి నర్సరీలో 12వేల మొక్కలు పెంచడమే లక్ష్యం

2022-2023 సంవత్సరానికి గ్రామ పంచాయతీల్లో నర్సరీల ఆధ్వర్యంలో 12 వేల మొక్కలు పెంచడమే లక్ష్యమని ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి అన్నారు. నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచలో శుక్రవారం నర్సరీ ఏర్పాటుకు మార్కింగ్‌ ఇచ్చే పనులను ఆయన పరిశీలించారు. ప్రతి పంచాయతీలో ప్రభుత్వ స్థలాల్లో ఇప్పటికే నర్సరీలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ప్రతి నర్సరీలో 12వేల మొక్కలు పెంచాలనే లక్ష్యంతో పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నర్సరీ నిర్వహణ బాధ్యత పంచాయతీదేనన్నారు. పంచాయతీ కార్యదర్శి గ్రామానికి కావాల్సిన మొక్కలు నర్సరీల్లో ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో భూపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మద్ది వినోద్ కుమార్, ఫిల్ అసిస్టెంట్ రాంపెల్లి సతీష్, వన సేవకులు, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్