కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టిన ట్రాక్టర్

నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. రహదారిపై వెళ్తున్న ట్రాక్టర్ అతివేగంతో అజాగ్రత్తతో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టడంతో స్తంభం విరిగిపోయింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన విద్యుత్ సిబ్బంది సరఫరాను నిలిపివేశారు. మరమ్మతులు చేపట్టి తాత్కాలికంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్