జనగాం: ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్

జిల్లా కేంద్రమైన జనగాం సమగ్ర జిల్లా కార్యాలయ సముదాయంలో ఉన్న ప్రధాన ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. శనివారం ఈ సందర్భంగా కలెక్టర్ భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పని తీరు, మంటల నియంత్రణ పద్ధతులను పరిశీలించారు. భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గోపిరాం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్