జనగాం: ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే

పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. శనివారం పరకాల పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదప్రజల కోసం అన్ని వసతులతో కూడిన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్