కొమురవెల్లి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన కొయ్యడ నరసింహులు మంగళవారం గుండెపోటుతో మరణించారు. వారి కుటుంబానికి జనగామ నియోజకవర్గం ఇన్ ఛార్జ్, డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ నుండి 10వేల రూపాయలు ఆర్థికసహాయం బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సనాది భాస్కర్, అయినపూర్ తాజా మాజీ సర్పంచ్ చెరుకు రమణారెడ్డి, తుమ్మల పల్లి సంతోష్, తదితరులు ఉన్నారు.