కొమురవెల్లి మండలం లెనిన్ నగర్ గ్రామంలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇంటింటి సర్వే శనివారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సనాది భాస్కర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుందని వారు తెలిపారు. ప్రజా పాలన దరఖాస్తు పరిశీలన చేసి ప్రతి ఒక్కరికి పేద కుటుంబాలకు ఇళ్లు వచ్చేలా కృషి చేస్తానన్నారు.