మద్దూర్ మండలం రేబర్తి గ్రామంలో ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను శనివారం ఇంటింటికీ వెళ్లి సర్వేను చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని మాజీ సర్పంచ్ అన్నారు. ఈ క్రమంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి, కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.