మద్దూర్: అంబేద్కర్ చౌరస్తా వద్ద హైమాక్స్ లైట్స్ ఏర్పాటు

జనగాం నియోజకవర్గ పరిధిలోని మద్దూర్/దూలిమిట్ట మండలం తోర్నాల గ్రామ అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఏర్పాటు చేసిన హైమాక్స్ లైట్స్ ను గ్రామస్తులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేసిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోల సాయిలు గౌడ్, మాజీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్