పాలకుర్తి: అక్రమంగా ఇసుక రవాణ చేస్తే కఠిన చర్యలు

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం మన్పాడ్ చెక్ డ్యామ్ వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను లోడు చేసిన ట్రాక్టర్ లను దేవరుప్పుల ఎస్సై సృజన్ కుమార్ సీజ్ చేసారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరుప్పుల మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమ ఇసుక రవాణ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు సీజ్ చేసిన ట్రాక్టర్ యజమాని కాసింపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్