వేచరేణి పాఠశాలలో జరిగిన తట్ట, పార ఘటనపై తల్లిదండ్రుల ఆగ్రహం

చేర్యాల మండల పరిధిలోని వేచరేణి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జరిగిన తట్ట, పార ఘటనపై శనివారం పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఘటనను విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు ఖండించారు. విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను తట్ట, పార గురించి నిలదీయగా విద్యార్థులు సరదాగా తట్ట, పారతో ఆటలాడే సమయంలో పట్టుకున్నామన్నారు. మరోసారి ఇలాంటి పొరపాటు చేయొద్దని తల్లిదండ్రులు విద్యార్థులను మందలించారు.

సంబంధిత పోస్ట్