ఇటీవలే ఎక్కువగా వినిపిస్తున్న సినిమా బలగం. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. పాతకాలంలో గ్రామాల్లో ఒక తెల్లటి గుడ్డ, ప్రొజెక్టర్ సహాయంతో సినిమాలు వేసేవారు. బలగం మళ్లీ ఆ పాత రోజులను గుర్తు చేస్తుంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో బలగం సినిమా ప్రదర్శించనున్నారు. ఆదివారం సాయంత్రం గ్రామ పంచాయితీ ఆవరణలో చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. సినిమా ప్రదర్శన దాసరి రాజేష్ ఆధ్వర్యంలో జరగనుంది. సహకరించిన డోనికన రమేష్, డోనికన కంట్లం, మేడి యాకన్నా, ఓర్సు జంపయ్య తుంపిల్ల సంపత్ కొమ్ములవంచ గ్రామం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.