ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను గురువారం భక్తులు దర్శించుకుంటున్నారు. వరుసగా సంక్రాంతి పండగ సెలవులు కావడంతో తల్లుల దర్శనం కోసం భక్తులు తరలి వస్తుండటంతో గద్దెల వద్ద భక్తుల రద్దీ నెలకొంది. వనదేవతలైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు పసుపు, కుంకుమ, బంగారం(బెల్లం) ముడుపులు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.