ఏటూరునాగారం: సందడి చేసిన చెంచులు

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని పలు గ్రామాల్లో చెంచులు సందడి చేశారు. నెమలి ఈకలు కలిగిన వస్త్రాలు వేషధారణలో మల్యాల, దొడ్ల కొండాయి, కొత్తూరు గ్రామాల్లో తిరుగుతూ పాటలు పాడుతూ ఆకట్టుకున్నారు. స్థానిక ప్రజలు ఇచ్చే కొంత నగదు, చిరు కానుకలను స్వీకరించారు. వారివద్ద ఉన్న గంటలు కొడుతూ.. గ్రామాల్లో తిరిగారు. దీంతో పలు ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్