ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను బోగి పండుగ రోజు సోమవారం సుమారు 10 వేల మంది భక్తులు తరలివచ్చి దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మినీ మేడారం జాతరకు ముందే భక్తులు భారీగా తరలివచ్చి వన దేవతలను దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.