ములుగు: రోడ్డు భద్రత అవగాహనపై 3కే రన్: జిల్లా ఎస్పీ

రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ములుగు జిల్లాలోని యువతీ, యువకులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం కోసం 3 కి. మీ రన్ నిర్వహిస్తున్నట్లు ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపారు. ఆసక్తి గల యువతీ, యువకులు ఆయా మండలాల్లోని పోలీస్ స్టేషన్లలో ఆధార్ కార్డుతో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఈనెల 21న పోటీల్లో పాల్గొనే అభ్యర్థులు ఉదయం 6: 30 గంటలకు జిల్లా కేంద్రంలోని ఓల్డ్ లారీ ఆఫీస్ దగ్గర హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్