తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానికానికి పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి ప్రజలందరికీ జీవితాలు వెలుగులు నింపాలని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రైజింగ్ తెలంగాణలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని కోరారు.