పస్రా సమీపంలోని మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాదం

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా మూలమలుపు వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తాడ్వాయి నుండి హన్మకొండ వైపు వెళ్తున్న కారు పస్రా గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద ప్రమాదవశాత్తు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు స్వల్పంగా గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు పేర్కొన్నారు. కాగా, ఈ మూలమలుపు వద్ద వరుసగా మూడవ ప్రమాదం కావడం గమనార్హం.

సంబంధిత పోస్ట్