ఒగ్లాపూర్ గ్రామంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు

దామెర మండలం ఒగ్లాపూర్ గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగ ఘనంగా జరిగింది. బుధవారం మహిళలు తలపై బోనాలు ఎత్తుకుని, డబ్బు చప్పుళ్ల నడుమ పోచమ్మ తల్లి ఆలయం వరకు చేరుకున్నారు. ఆలయంలో సంప్రదాయ రీతిలో నూతన వస్త్రాలు పోచమ్మ తల్లి ఎదుట పెట్టి, అమ్మ వారికి పసుపు, కుంకుమలు, నైవేద్యం సమర్పించారు. ఇందులో పిల్ల పాపలతో పెద్దలు పోచమ్మ తల్లికి మొక్కులు సమర్పించుకున్నారు. మేక, గొర్రె పోతులను బలి ఇచ్చారు.

సంబంధిత పోస్ట్