వరంగల్ పర్యటనలో భాగంగా వరంగల్ నిట్ కు చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఆదివారం సాయంత్రం ఘనంగా స్వాగతం పలికారు. వరంగల్ నిట్ కు చేరుకున్న డిప్యూటీ సీఎంకు వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య , వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు తదితరులు పూల మొక్కలు, పుష్పగుచ్చాలను అందించి ఘనంగా స్వాగతం పలికారు.