ఏపీలో పురుషులకు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. పురుషులకు స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై అసెంబ్లీలో మంత్రి సమాధానం ఇచ్చారు. విజయవాడ, విశాఖలో ఇప్పటివరకు 818 పురుషులకు స్వయం సహాయక సంఘాలున్నాయన్నారు. ఏప్రిల్ 2025 నాటికి దేశంలోని అన్ని నగరాల్లో వర్తింపచేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోందని తెలిపారు.