పూణే శివార్లలోని పింప్రి చించ్వాడ్ శివారు ప్రాంతమైన హింజేవాడిలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువతి రహదారి పక్కన నిల్చుంది. ఆ సమయంలో ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. మెరుపు వేగంతో రోడ్డు పక్కన నిల్చున్న యువతిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు ఆ యువతి గాల్లోకి ఎగిరి కింద పడింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. మే 23న జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.